Kaizer News

Shamshabad Road Accident | శంషాబాద్‌ రహదారిపై మృత్

Shamshabad Road Accident | శంషాబాద్‌ రహదారిపై మృత్యుఘోష.. కల్వర్టును ఢీకొన్న కారు

· City - Hyderabad · prabhanews.com

శంషాబాద్‌, ఆంధ్రప్రభ: శంషాబాద్‌ మండలం పాల్మాకుల సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడటంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు మహబూబ్‌నగర్‌ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Original source: prabhanews.com
Read more on Kaizer News