ఎకరాలపై అధికారుల సర్వే.. రికార్డులు, హద్దుల పరిశీలన ప్రభుత్వ భూములు ఉన్నాయన్న ప్రభుత్వ వాదన.. ఆరోపణలను ఖండిస్తున్న బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయి కొలతలతోపాటు పాత రికార్డులు, శాటిలైట్ వివరాల పరిశీలన తుది నివేదిక వచ్చేదాకా ఏది వాస్తవం? ఏది ఆరోపణ? అన్నది తేలాల్సిందే కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద మూడో రోజు కొనసాగుతున్న సర్వే రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన.. రికార్డుల వెరిఫికేషన్ హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూముల అంశం చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న భూములపై అధికారుల సర్వే కొనసాగుతోంది. సర్వే నంబర్ 325లోని సుమారు 388 ఎకరాల భూముల హద్దులు, రికార్డులు, వాటి స్వరూపాన్ని రెవెన్యూ, భూ సర్వే అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఒకవైపు.. అవన్నీ రాజకీయ దుష్ప్రచారమేనంటున్న బీఆర్‌ఎస్ వాదన మరోవైపు ఉండటంతో ఎర్రవల్లి వ్యవహారం రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. అయితే ప్రస్తుతం జరుగుతున్నది విచారణ, సర్వే మాత్రమే. భూములపై తుది నిర్ధారణ వెలువడలేదు. అధికారుల నివేదిక వచ్చిన తర్వాతే వాస్తవ పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, వరదరాజ్‌పూర్ గ్రామాల పరిధిలోని సర్వే నంబర్ 325లో 388 ఎకరాల భూమిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ భూములు గతంలో పేద దళిత కుటుంబాలకు అసైన్డ్ చేసినవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వాటి హద్దులను గుర్తించడంతోపాటు పాత రికార్డులను పరిశీలిస్తున్నారు. సర్వేలో భాగంగా భూముల సరిహద్దులు, సర్వే నంబర్లు, గతంలో భూములు పొందిన వారి వివరాలు, ప్రస్తుత రికార్డులను పరస్పరం సరిపోల్చుతున్నారు. అవసరమైన చోట శాటిలైట్ ఆధారిత సమాచారాన్ని కూడా ఉపయోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అంశంలో మరో ముఖ్యమైన విషయం.. ఇప్పటివరకు అధికారులు కేసీఆర్ ఫామ్‌హౌస్ ప్రాంగణంలోకి వెళ్లి కొలతలు చేపట్టలేదు. చుట్టుపక్కల భూములు, సంబంధిత సర్వే నంబర్ల పరిధి, వాటి హద్దులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా అధికారుల అంచనా ప్రకారం పూర్తి సర్వే, రికార్డుల పరిశీలనకు సుమారు 10 నుంచి 15 రోజులు పట్టే అవకాశం ఉంది. అనంతరం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ భూముల అంశాన్ని ప్రస్తావించారు. ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో ప్రభుత్వ భూమి ఉందా? అసైన్డ్ భూములు ప్రైవేటు భూములతో కలిసిపోయాయా? అనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఫామ్‌హౌస్ విస్తీర్ణం సుమారు 700 ఎకరాల వరకు ఉందన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇందులో ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే దానిని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు, ముఖ్యంగా దళిత కుటుంబాలకు అందించే ఉద్దేశం ఉందని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఇవన్నీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు, ప్రకటనలు మాత్రమే. భూముల అసలు స్వరూపం, ఎవరి పేరుపై ఎంత భూమి ఉంది, ఏ భూమి అసైన్డ్, ఏది పట్టా అనే అంశాలను అధికారులు ప్రస్తుతం రికార్డుల ఆధారంగా నిర్ధారిస్త