Kaizer News

Bogaram: హోలీ మేరీ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయే

Bogaram: హోలీ మేరీ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు!

· City - Hyderabad · hmtvlive.com

Bogaram: హోలీ మేరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ డే–2026 వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర భద్రతా సలహాదారు (State Security Advisor) బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ (రిటైర్డ్) ముఖ్య అతిథిగా, సెంచూరియన్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జె.ఎం. రావు గౌరవ అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ (రిటైర్డ్) మాట్లాడుతూ, విద్యార్థులు తమ విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని వృత్తి జీవితంలోకి అడుగుపెడుతున్న సమయంలో జ్ఞానం, నైపుణ్యాలతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. గౌరవ అతిథి డాక్టర్ జె.ఎం. రావు, విద్యార్థులు సాధించిన జ్ఞానాన్ని వాస్తవ జీవిత సమస్యల పరిష్కారానికి వినియోగించాలని సూచించారు. సాంకేతిక నైపుణ్యాలతో పాటు సృజనాత్మకత, ఆవిష్కరణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. భవిష్యత్‌లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమను తాము నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. చంద్రశేఖర్ కళాశాల వార్షిక నివేదికను సమర్పిస్తూ, హోలీ మేరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ 1994–95లో MCA కార్యక్రమంతో 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన విద్యా ప్రస్థానం నుంచి, నేడు UGC అటానమస్ హోదాతో అభివృద్ధి చెందిన విద్యాసంస్థగా ఎదిగిన విధానాన్ని వివరించారు. సంస్థకు 2021లో UGC అటానమస్ హోదా లభించిందని, ఇది 2031 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో విద్యార్థులు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో సంస్థ మొత్తం 74 శాతం ఉత్తీర్ణత సాధించిందని, GATE, CAT మరియు GRE పరీక్షల్లో 100 మంది విద్యార్థులు అర్హత సాధించారని పేర్కొన్నారు. NEP–2020కు అనుగుణంగా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, అన్‌మ్యాన్డ్ ఎయిర్ వెహికల్ సిస్టమ్స్, జనరేటివ్ AI, సోషల్ మీడియా సెక్యూరిటీ వంటి ఆధునిక, నైపుణ్య ఆధారిత కోర్సులను పాఠ్యప్రణాళికలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. గ్రాడ్యుయేషన్ డేలో భాగంగా 621 మంది విద్యార్థుల్లో 445 మంది తమ కోర్సులను విజయవంతంగా పూర్తి చేశారని, వీరిలో 91 మంది First Class with Distinction, 297 మంది First Class, 57 మంది Second Class సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. గోల్డ్, సిల్వర్ మెడల్స్‌తో విద్యార్థులకు సత్కారం విద్యా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ప్రదానం చేశారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ముఖ్య అతిథి, గౌరవ అతిథి మరియు కళాశాల యాజమాన్య ప్రతినిధులు సత్కరించారు. CSE–DS విభాగానికి చెందిన అనెమోని అఖిల 9.17 CGPAతో కళాశాల టాపర్‌గా నిలిచి గ

Original source: hmtvlive.com
Read more on Kaizer News