Kaizer News

మోదీకి ఉజ్బెకిస్థాన్‌ అత్యున్నత పురస్కారం

మోదీకి ఉజ్బెకిస్థాన్‌ అత్యున్నత పురస్కారం

· National - India · ntnews.com

తాష్కెంట్‌: ప్రధాని మోదీకి ఆదివారం ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు షవ్‌కట్‌ మిర్జియోయెవ్‌ తమ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ ‘ఓలియ్‌ డరజలీ డస్ట్‌లిక్‌’ను తాష్కెంట్‌లో ప్రదానం చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందించారు. ఇరు దేశాల స్థిరమైన స్నేహానికి, దగ్గరి సంబంధాలకు ఈ పురస్కారాన్ని మోదీ అంకితం చేశారు. ప్రతినిధుల స్థాయిలో జరిగిన చర్చల్లో మోదీ, షవ్‌కట్‌ పాల్గొని ఆర్థికం, వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్‌ అనుసంధానం, రక్షణ, ఎనర్జీ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు

Original source: ntnews.com
Read more on Kaizer News