Kaizer News

Bigg Boss Telugu Season 10: కడియం శ్రీహరిలో పెరిగి

Bigg Boss Telugu Season 10: కడియం శ్రీహరిలో పెరిగిన టెన్షన్.. ఎమ్మెల్యే పదవికి ముప్పు తప్పదా..?

· Entertainment · hmtvlive.com

బిగ్‌బాస్ సీజన్-10 రెండోవారానికి చేరుకునేసరికి హౌస్‌లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో త్రిగుణ్, రోహిత్ నాయుడు, రామ్ ప్రసాద్‌తో పాటు పలువురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు బరిలో నిలవడంతో ఎలిమినేషన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తాజా అప్‌డేట్ ప్రకారం.. ప్రేక్షకుల నుంచి తగినన్ని ఓట్లు రాకపోవడం, హౌస్‌లో ఆశించిన స్థాయిలో యాక్టివ్‌గా లేకపోవడంతో *కృష్ణుడు* ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. షో ప్రారంభంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. అందులో భాగంగా కృష్ణుడికి అరుదైన ‘స్విచ్ పవర్’ దక్కింది. ఈ పవర్‌తో ఆయన ఆటలో ఎప్పుడైనా తన స్థానాన్ని మరో కంటెస్టెంట్‌తో మార్చుకోవచ్చు లేదా ఇద్దరి స్థానాలను తారుమారు చేయవచ్చు. బిగ్‌బాస్ లాంటి పెద్ద వేదికపై ఇలాంటి ప్రత్యేక పవర్స్ ఎవరికీ అంత సులభంగా రావు. కానీ కృష్ణుడు ఆ అవకాశాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయారు. హౌస్‌లో వివాదాలకు దూరంగా, ఎవరితోనూ పెద్దగా గొడవపడకుండా సైలెంట్‌గా ఉండాలనే ఆయన ఆలోచనే ఆయన కొంపముంచినట్లు కనిపిస్తోంది. కీలకమైన టాస్క్‌ల సమయంలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయకపోవడం, చేతిలో ఉన్న పవర్‌ను వాడుకునే సరైన సమయం కోసం చూస్తూ ఉండిపోవడంతో కాలం చెల్లిపోయింది. చివరకు శక్తి ఉండి కూడా దాన్ని ప్రయోగించకపోవడం వల్ల ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకోవడంలో కృష్ణుడు విఫలమయ్యారు. ఆటలో కేవలం నటుడిగా ఉన్న గుర్తింపు సరిపోదని, ప్రతీక్షణం అప్రమత్తంగా ఉంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఈ ఎలిమినేషన్ మరోసారి నిరూపించింది. మరి రాబోయే రోజుల్లో మిగిలిన కంటెస్టెంట్లు ఈ తప్పుల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారో వేచి చూడాలి. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News