Kaizer News

లేటెస్ట్‌ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ డీల్‌..

లేటెస్ట్‌ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ డీల్‌..

· Business · sakshi.com

ఐఫోన్‌లకు ఉన్న క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చాలామందికి ఈ ప్రీమియం ఫోన్‌లు వాడాలని ఉన్నా వాటి అధిక ధరల కారణంగా కొనలేరు. అయితే యాపిల్‌ ఐఫోన్‌ కొత్త సిరీస్‌ విడులకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ప్రస్తుత ఐఫోన్‌ 17 ప్రో (iPhone 17 Pro)పై ఫ్లిప్‌కార్ట్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 256GB వేరియంట్‌ను రూ.90 వేలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 17 ప్రో 256GB వేరియంట్‌ ప్రస్తుతం రూ.1,29,900కు లిస్టయింది. దీని అసలు ధర రూ.1,34,900 కాగా, నేరుగా రూ.5,000 తగ్గింపు లభిస్తోంది. అదనంగా అర్హత కలిగిన ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.9,000 వరకు బ్యాంక్‌ డిస్కౌంట్‌ లభిస్తున్నట్లు ఉత్పత్తి పేజీలో చూపిస్తోంది. ఈ డీల్‌లో అసలు ఆకర్షణ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌. ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం ఎంపిక చేసిన పాత ఫోన్లపై ఎక్స్ఛేంజ్‌ విలువను అందిస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్‌ 15కి రూ.30,000 వరకు విలువ లభించవచ్చని తాజా డీల్‌ వివరాలు సూచిస్తున్నాయి. రూ.30,000 ఎక్స్ఛేంజ్‌ ప్రయోజనం, రూ.9,000 బ్యాంక్‌ డిస్కౌంట్‌ రెండూ పూర్తిగా లభిస్తే ఐఫోన్‌ 17 ప్రో రూ.90,900 లకే వస్తుంది. ఐఫోన్‌ 17 ప్రో మోడల్‌లో A19 ప్రో చిప్‌, 6.3 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే, 48MP కెమెరా సిస్టమ్‌, 18MP సెంటర్‌ స్టేజ్‌ ఫ్రంట్‌ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం

Original source: sakshi.com
Read more on Kaizer News