లార్డ్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు చేసిన రూట్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదే తీరును కనబరిచాడు. 24 పరుగులు చేసి మహ్మద్ అలీ బౌలింగ్‌లో వికెట్ల ముందు అతడు దొరికిపోయాడు. ఈ మ్యాచ్‌లో రూట్ ఘోరంగా విఫలమైనప్పటికి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో సొంత గడ్డపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన ప్లేయర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. 35 ఏళ్ల రూట్ ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు 7,594 రన్స్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ ఆస్ట్రేలియాలో 7,578 టెస్టు రన్స్ చేశాడు. లార్డ్స్ టెస్టులో 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పాంటింగ్‌ను రూట్ అధిగమించాడు. ఈ జాబితాలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్(7216), శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే(7167) మూడు నాలుగు స్ధానాల్లో ఉన్నారు. పట్టు బిగించిన ఇంగ్లండ్ ఇక ఈ రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రూట్ సేన ప్రస్తుతం 261 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే కుప్పకూలింది. చదవండి : ఐదో స్థానం.. అయినా రూ. 50 లక్షల నజరానా ఎందుకంటే? మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) మా ఆయనను చంపింది కటౌట్ శ్రీను! సతీష్ రెడ్డి భార్య, వదిన సంచలన కామెంట్స్ టాక్సిక్ నిరాశలో రుక్మిణి.. ఇక ఆశలన్నీ డ్రాగన్ పైనే టార్చ్ లైట్లు వేసుకొని చికిత్సలా.. కొంచమైనా బుర్ర ఉందా..!?