Kaizer News

Podusthunna Poddu Meeda | నాని ‘ది ప్యారడైజ్’ సిని

Podusthunna Poddu Meeda | నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలో ‘పొడుస్తున్న పొద్దుమీద’?

· Entertainment · ntnews.com

Nani’s The Paradise | నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేయగా, తాజాగా మ్యూజికల్ ఫీస్ట్‌కు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతంలో రాబోతున్న పాటల జాబితా నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఉద్యమ గీతంగా కోట్లాది మంది ప్రజల హృదయాలను హత్తుకున్న ప్రసిద్ధ ప్రజా యుద్ధ నౌక గద్దర్ అమూల్యమైన గీతం ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా…’ పాటను ఈ సినిమాలో ఉపయోగిస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల’ పాటలతో పాటు ఈ ఐకానిక్ ఫోక్ సాంగ్ కూడా సినిమాలో చోటు చేసుకుంటే, థియేటర్లలో ప్రేక్షకుల ఊపు చూసి థియేటర్లు ఊగిపోవడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. అనిరుధ్ మ్యూజిక్, శ్రీకాంత్ ఓదెల టేకింగ్, నాని మాస్ పెర్ఫార్మెన్స్‌కు తోడు ఈ ఫోక్ సాంగ్ తాలుక వైబ్స్ తోడైతే సిల్వర్ స్క్రీన్ మీద రికార్డులు తిరగరాయడం పక్కా అని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై చిత్ర‌యూనిట్ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇవి కేవ‌లం రుమ‌ర్స్ అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News