Kaizer News

NADA | మారథాన్ రన్నర్‌కు ‘నాడా’ నోటీసు.. ఆసియా క్ర

NADA | మారథాన్ రన్నర్‌కు ‘నాడా’ నోటీసు.. ఆసియా క్రీడల్లో పాల్గొనడంపై ఉత్కంత..!

· National - India · ntnews.com

NADA : ఆసియా క్రీడలకు ముందే భారత్‌కు బిగ్ షాక్. ఇప్పటికే రెజ్లర్ ముకుల్ దహియా (Mukul Dahiya) నిషేధానికి గురవ్వగా.. అథ్లెటిక్స్ బృందంలోని అభిషేక్ పల్‌ (Abhishek Pal) సైతం ఈ మెగా టోర్నీలో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (NADA) అతడికి నోటీసులు జారీ చేయడమే అందుకు కారణం. అభిషేక్ రక్త నమూనాల్లో నిషేధిత పదార్థం ఉండడంతో ఆగ్రహించిన నాడా ‘ఎందుకిలా జరిగింది’ చెప్పాలంటూ అథ్లెట్‌ను వివరణ కోరింది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు ఎంపికైన 72 మంది బృందంలో ఒకడైన అభిషేక్ పల్‌ ఒకడు. మారథాన్ రన్నరైన అతడు 5,000 మీటర్లు, 10,000 మీటర్ల పరుగులో బరిలోకి దిగనున్నాడు. అయితే.. ఈ మెగా ఈవెంట్‌కు ముందే అతడికి నాడా నోటీసులు పంపింది. అభిషేక్‌కు డోప్ పరీక్ష నిర్వహించగా రక్త నమూనాల్లో నిషేధిత డ్రగ్ ఉండడంతో వివరణ ఇవ్వాలని కోరింది. నిషేధిత పదార్థం కొద్ది మోతాదులోనే ఉన్నప్పటికీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నాడా అభిషేక్‌కు నోటీసులు జారీ చేసింది. ‘అభిషేక్‌కు డోప్ పరీక్ష నిర్వహించాం. అతడి రక్త నమూనాల్లో నిషేధిత పదార్ధం కొద్ది మొత్తంలో కనిపించింది. దాంతో, అభిషేక్‌కు నాడా నోటీసులు పంపింది. సంతానం కోసం మహిళలు ఉపయోగించే ఫర్టిలిటీ డ్రగ్ అది. అందుకని.. ఆ పదార్థం తన నమూనాల్లో ఉండడం అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆసియా క్రీడలు సమీపిస్తున్నుందు.. అభిషేక్ ఈ విషయంపై నాడా దర్యాప్తు కోరే అవకాశముంది. అయితే.. ఇప్పటివరకైతే అభిషేక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిషేధం గురించి కూడా ఇంకా నాడా నిర్ణయం తీసుకోలేదు’ అని ఒక అధికారి వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారథాన్ రన్నర్‌గా రాణిస్తున్న అభిషేక్.. 2023 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌10వేల మీటర్ల పరుగులో కాంస్యంతో మెరిశాడు. జపాన్‌లోని ఐచీ – నగోయ వేదికగా సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఆసియా క్రీడలు మొదలవ్వనున్నాయి

Original source: ntnews.com
Read more on Kaizer News