ఢిల్లీలోని స్వరూప్‌నగర్‌లో ఓ టీనేజ్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 13న కుషక్ రోడ్ సమీపంలోని పొలాల్లో బాలిక మృతదేహం లభించింది. 50కిపైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఘటనకు సమీపంలో కనిపించిన టెంపో ఆధారంగా నిందితులను గుర్తించారు. 19 ఏళ్ల యువకుడితో పాటు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు