Kaizer News

TG| దారుణ హత్య..

TG| దారుణ హత్య..

· City - Hyderabad · prabhanews.com

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతో 55 ఏళ్ల వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. చంపాపేట పరిధిలోని గుండాల షా బాబా రోడ్డులో ఆదివారం అర్ధ‌రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని మెహబూబ్‌ అలీ సాహెబ్‌ అలియాస్‌ ఉమర్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నలుగురు నిందితుల ప్రమేయం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను ఎంఐఎం నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్పీ జావేద్‌ అలీ, సీఐలతో సమావేశమై నిందితులను త్వరగా అరెస్టు చేయాలని కోరారు. దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు

Original source: prabhanews.com
Read more on Kaizer News