Shorts Malkajgiri: మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్‌నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా ఈసం రాకేష్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వం ఆయనను డివిజన్ అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఈసం రాజేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలు, డివిజన్, జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీని డివిజన్‌లో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పనిచేస్తానని రాకేష్ పేర్కొన్నారు