Kaizer News

ప్రచారంలో ఉన్నట్లు రీషూట్స్‌ చేయలేదు: దర్శకుడు శ్ర

ప్రచారంలో ఉన్నట్లు రీషూట్స్‌ చేయలేదు: దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల

· Entertainment · sakshi.com

‘‘నేను అనుకున్న షాట్‌ వచ్చేంతవరకు వందసార్లైనా తీస్తాను. ఈ విషయంలో మా ప్యారడైజ్‌’ టీమ్‌ను ఇబ్బంది పెట్టాను (నవ్వుతూ). కానీ ఒకసారి ఓకే అయిన తర్వాత రీషూట్‌ జోలికి వెళ్లను’’ అని శ్రీకాంత్‌ ఓదెల చెప్పారు. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ది ప్యారడైజ్‌’. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో శ్రీకాంత్‌ ఓదెల చెప్పిన సంగతులు.. ⇒ ‘దసరా’తో నాకు దర్శకుడిగా జీవితం ఇచ్చిన వ్యక్తి నానీగారు. ఆ సినిమా రిలీజ్‌కు ముందే రిజల్ట్‌తో సంబంధం లేకుండా మరో మూవీ చేద్దామని నానీగారు అన్నారు. ‘ది ప్యారడైజ్‌’లో జడల్‌ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. నానీగారికి జడలు వేద్దామని నా టీమ్‌తో అంటే వద్దన్నారు. కానీ కథని, క్యారెక్టర్‌ని నమ్మి నానీగారు ఒప్పుకున్నారు. మోహన్‌బాబుగారు ఇందులో మెయిన్‌ విలన్‌. ఆయన, నాని మధ్య వచ్చే సీన్స్‌ బాగుంటాయి. ⇒ ‘ది ప్యారడైజ్‌’ని 171 రోజులు షూట్‌ చేశాం. నేను అనుకున్నట్లు సినిమా తీయడానికి, టార్గెట్‌ రీచ్‌ కావడానికి కాస్త ఆలస్యమైంది. దీంతో యూనిట్‌ అందరి కాల్షీట్స్‌ మళ్లీ సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అంతేకానీ ప్రచారంలో ఉన్నట్లు రీ షూట్స్‌ చేయలేదు. బౌండ్‌ స్క్రిప్ట్‌లో మార్పులు చేయలేదు. షూటింగ్‌ ప్లాన్‌ బాగానే ఉన్నా, ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్‌ అయ్యానేమో అనిపించింది. నెక్ట్స్‌ టైమ్‌ ఇచ్చిన మాటపై నిలబడాలనుకుంటున్నాను.. అంటే చెప్పిన టైమ్‌కి సినిమాను రిలీజ్‌ చేయడం, అనుకున్న టైమ్‌లో షూట్‌ పూర్తి చేయడం వంటివి. ⇒ ‘ది ప్యారడైజ్‌’లో బిట్‌ సాంగ్స్‌తో కలిపి ఆరు పాటలున్నాయి. నా చిన్నప్పుడు ఆటోలో వెళ్తున్నప్పుడు ‘ఏషనాగుల..’ పాట వినేవాడిని. ‘దసరా’ చిత్రానికే ఈ పాట పెడదామనుకున్నా. ‘ది ప్యారడైజ్‌’కు కుదిరింది. ⇒ నా దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేయాలని ఉంది. అలాగే చిరంజీవిగారితో సినిమా కచ్చితంగా ఉంటుంది. ప్యారడైజ్‌’ రిలీజ్‌ తర్వాత మా ఫ్యామిలీతో టైమ్‌ గడపాలి. ఆ తర్వాత నా నెక్ట్స్‌ మూవీ గురించి చెబుతాను. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News