Kaizer News

స్టార్టప్‌‌‌‌ల కోసం నెక్స్ట్ భారత్ వెంచర్స్ రూ.20

స్టార్టప్‌‌‌‌ల కోసం నెక్స్ట్ భారత్ వెంచర్స్ రూ.20 కోట్ల సీడ్ ఫండింగ్

· National - India · v6velugu.com

హైదరాబాద్​, వెలుగు: సుజుకీ మోటార్స్​అనుబంధ సంస్థ నెక్స్ట్ భారత్ వెంచర్స్ (ఎన్‌‌‌‌బీఓ) వినూత్న సేవలు అందిస్తున్న స్టార్టప్‌‌‌‌ల కోసం రూ.20.76 కోట్ల సీడ్ ఫండింగ్‌‌‌‌ను ప్రకటించింది. అట్టడుగు వర్గాలు, గ్రామాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే స్టార్టప్‌‌‌‌లలో పెట్టుబడులు పెట్టే ఈ క్యాపిటల్ ఫండ్, బెంగళూరు వేదికగా 'ఇంపాక్ట్ రిపోర్ట్ 2026' ను విడుదల చేసింది. ఈ ఫండింగ్‌‌‌‌లో భాగంగా వ్యాక్సిన్ల సురక్షిత రవాణా కోసం 'బ్లాక్‌‌‌‌ఫ్రాగ్ టెక్నాలజీస్'కు రూ.తొమ్మిది కోట్లు కేటాయించింది. ఈ-మొబిలిటీ సొల్యూషన్స్ అందించే 'ఈ-బిక్'కు రూ.7.5 కోట్లు, సోలార్ వంట సామగ్రిని ఇస్తున్న 'సిబోస్'కు రూ.రెండు కోట్లు, 'వెలాన్ మార్ట్'కు రూ.1.26 కోట్లు, వ్యవసాయ యంత్రాల తయారీ సంస్థ 'ఎస్‌‌‌‌జీబీ ఆగ్రో'కు రూ. కోటి చొప్పున సీడ్ ఫండ్‌‌‌‌ను అందించినట్లు సంస్థ పేర్కొంది. సుజుకి మోటార్స్ వంటి జపాన్ సంస్థల అండతో నడుస్తున్న ఈ ఫండ్‌‌‌‌ ద్వారా ఇప్పటికే 21 స్టార్టప్‌‌‌‌లు దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చాయని ఎన్‌‌‌‌బీవీ సీఈవో విపుల్ నాథ్ జిందాల్ తెలిపారు. రాబోయే రోజుల్లో మెడికల్, ఏఐ రంగాల్లోనూ ఇలాంటి సామాజిక ప్రభావం చూపే ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు

Original source: v6velugu.com
Read more on Kaizer News