సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయం వద్ద శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. కారు పూజ కోసం ఆలయానికి వచ్చిన ఓ 70 ఏళ్ల వృద్ధుడు.. అదే కారు కింద పడి అనూహ్యరీతిలో మృతిచెందారు. మేనల్లుడి కారు పూజ కార్యక్రమం కోసం రామచంద్రరావు(70) బంధువులతో పెద్దమ్మ గుడికి వచ్చారు. పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత కారును అక్కడి నుంచి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొరపాటున యాక్సిలరేటర్‌ను తొక్కడంతో వాహనం ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న వృద్ధుడు కారు కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లు సమాచారం. ఆలయ ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) యువతకు తోడుగా నేనుంటా..! కూటమిపై రాచమల్లు అల్లుడు ఫైర్ గురు శిష్యుల చీకటి ఒప్పందంతో రాయలసీమ తాకట్టు.. శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు