కోలీవుడ్ స్టార్ అజిత్ జీవితం ఆధారంగా వస్తోన్న మూవీ గ్లాడియేటర్స్. ఆయన సినిమాలతో పాటు కార్ రేసింగ్‌లోనూ దూసుకెళ్తున్నారు. అజిత్ రేసింగ్ జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో అజిత్ కార్ రేస్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో అజిత్ జర్నీ గురించి ఆయన సతీమణి కూడా మాట్లాడారు. రేసింగ్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ట్రైలర్‌లోని కార్ రేసింగ్ సన్నివేశాలు సైతం అజిత్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దాదాపు గంటన్నర రన్‌టైమ్‌తో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అజిత్ రియల్ రేసింగ్ ఈవెంట్ ఫుటేజీ కూడా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!