దేశవ్యాప్తంగా NEET PG ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 2,73,183 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా సుమారు 1,300 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. తెలంగాణలో 17,627 మంది అభ్యర్థులు 56 కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యారు. అయితే రంగారెడ్డి జిల్లా శేరిగూడ పరీక్షా కేంద్రానికి మద్యం మత్తులో వచ్చిన ఓ విద్యార్థిని సిబ్బంది గుర్తించి పరీక్షకు అనుమతించలేదు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు CBT విధానంలో పరీక్ష జరిగింది