Ukraine-Russia war | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో శనివారం భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం. నగరంలోని భారీ ఆయుధాల నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. పేలుడు శబ్దంతో నగరంలోని ప్రజలు భయాందోళనకు గురైనట్లు సమాచారం. అయితే ఈ దాడిపై ఇప్పటివరకు అధికారికంగా పూర్తి వివరాలు వెలువడలేదు. ఘటనలో ప్రాణనష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత మేరకు సంభవించింది అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయుధాల నిల్వ కేంద్రంపైనే దాడి జరిగిందా? లేదా ఇతర లక్ష్యాలను గురి చేశారా? అనే అంశాలపై కూడా అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు