Kaizer News

ఎనిమిదో స్థానంతో సరి

ఎనిమిదో స్థానంతో సరి

· National - India · sakshi.com

వర్గీకరణ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో భారత్‌ ఓటమి అమ్‌స్టెల్వీన్‌: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు ఎనిమిదవ స్థానంతో సరిపెట్టుకుంది. వర్గీకరణ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత జట్టు షూటౌట్‌లో బెల్జియం చేతిలో ఓడింది. 7–8 స్థానాల కోసం శుక్రవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో టీమిండియా 3–4 గోల్స్‌ తేడాతో బెల్జియం చేతిలో ఓడింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3–3తో సమంగా నిలవగా... విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ నిర్వహించారు. భారత్‌ తరఫున కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ (31వ, 60వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... అభిõÙక్‌ (6వ నిమిషంలో) ఒక గోల్‌ చేశాడు. బెల్జియం తరఫున రోమాన్‌ (22వ ని.లో), హుగో (23వ ని.లో), స్లూవర్‌ (47వ ని.లో) తలా ఒక గోల్‌ చేశారు. షూటౌట్‌లో శైలానంద్‌ లక్రా, దిల్‌ప్రీత్‌ సింగ్, అభిషేక్‌ గోల్స్‌ చేయగా... హర్మన్‌ప్రీత్, సుఖ్‌జీత్‌ విఫలమవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. గత ప్రపంచకప్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచిన టీమిండియా ఈ సారి ఒక స్థానం మెరుగు పరుచుకుంది. మహిళల హాకీ జట్టుకు 50 లక్షల నజరానా.. మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఐదో స్థానంలో నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) శుక్రవారం రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. 1974లో తొలిసారి నిర్వహించిన హాకీ వరల్డ్‌కప్‌లో అత్యుత్తమంగా నాలుగోస్థానంలో నిలిచిన భారత జట్టు మళ్లీ 52 ఏళ్ల తర్వాత మెరుగైన ప్రదర్శన చేసింది. వరల్డ్‌కప్‌లో చక్కటి ఆటతీరు కనబర్చిన ప్లేయర్లను హెచ్‌ఐ అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ అభినందించారు. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు.. చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా

Original source: sakshi.com
Read more on Kaizer News