Kaizer News

1 నుంచి రాత్రి బస్సులు

1 నుంచి రాత్రి బస్సులు

· City - Hyderabad · sakshi.com

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెపె్టంబర్‌ 1 నుంచి రాత్రి బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు వివిధ మార్గాల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆయా రూట్లు, వేళలు ఇలా ఉన్నాయి.. రూట్‌ నంబర్‌ 222 ఏ కోఠీ నుంచి అబిడ్స్, లక్డీకాపూల్, బషీర్‌బాగ్, ఉస్మానియా యూనివర్సిటీ, గుట్టలబేగంపేట్, కొండాపూర్, కోకాపేట తదితర ప్రాంతాల మీదుగా పటాన్‌చెరు వరకు ఈ సర్వసు నడుస్తుంది. మొత్తం నాలుగు బస్సులు అందుబాటులో ఉంటాయి. కోఠీ నుంచి మొదటి బస్సు రాత్రి 11.40 గంటలకు బయలుదేరుతుంది. చివరి బస్సు 4.30 గంటలకు బయలుదేరుతుంది. పటాన్‌చెరు నుంచి మొదటి బస్సు రాత్రి 11, చివరి బస్సు ఉదయం 4.55 గంటలకు బయలుదేరుతాయి. ప్రతి 45 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటుంది. రూట్‌ నంబర్‌ 218 సీబీఎస్, కోఠీ, లక్డీకాపూల్, ఎన్‌ఆర్‌ నగర్, పంజాగుట్ట, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా నడుస్తాయి. అఫ్జల్‌గంజ్‌ నుంచి మొదటి బస్సు రాత్రి 11.25కు, చివరి బస్సు ఉదయం 3.05 గంటలకు బయలుదేరుతాయి. పటాన్‌చెరు నుంచి రాత్రి 11.20కి మొదటి బస్సు, ఉదయం 3.15 గంటలకు చివరి బస్సు బయలుదేరుతాయి. ప్రతి 1.15 గంటలకో బస్సు ఉంటుంది. రూట్‌ నంబర్‌ 219 సికింద్రాబాద్‌ నుంచి పటాన్‌చెరు మధ్య ప్యారడైజ్, ట్యాంక్‌బండ్, బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైటెక్‌ సిటీ, గచి్చ»ౌలి, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా ఈ బస్సులు నడుస్తాయి. సికింద్రాబాద్‌ నుంచి మొదటి బస్సు రాత్రి 11.20కి, చివరి బస్సు ఉదయం 3 గంటలకు, పటాన్‌చెరు నుంచి రాత్రి 11.25కు, చివరి బస్సు ఉదయం 3 గంటలకు అందుబాటులో ఉంటా యి. ప్రతి 1.10 గంటలకో సరీ్వసు నడుస్తుంది. రూట్‌ నంబర్‌ 290యూ హయత్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ మధ్య వనస్థలిపురం, ఎల్‌బీనగర్, నాగోల్, నాగోల్‌ మెట్రో, స్టేషన్‌ ఎన్‌జీఆర్‌ఐ, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్, రసూల్‌పురా, జేబీఎస్‌ తదితర ప్రాంతాల మీదుగా నడుస్తాయి. హయత్‌నగర్‌ నుంచి మొదటి బస్సు రాత్రి 11.20కి, చివరి బస్సు ఉదయం 3 గంటలకు, సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11.25కు, చివరి బస్సు ఉదయం 3 గంటలకు నడుస్తాయి. ప్రతి 1.15 గంటలకో ఒక బస్సు ఉంటుంది. రూట్‌ నంబర్‌ 195 డబ్ల్యూ బాచుపల్లి నుంచి వేవ్‌రాక్‌ మధ్య విప్రో సర్కిల్, ఇన్ఫోసిస్‌ క్యాంపస్, జేఎన్‌టీయూ, బయోలాజికల్‌ సిటీ, ఈఎస్‌ఐసీ, ఇంద్రానగర్‌ తదితర ప్రాంతాలను కలుపుతూ సరీ్వసులు ఉంటాయి. బాచుపల్లి నుంచి మొదటి బస్సు రాత్రి 9.15కు, చివరి బస్సు ఉదయం 3.10 గంటలకు బయలుదేరుతాయి. వేవ్‌రాక్‌ నుంచి రాత్రి 10.25, ఉదయం 4.25 గంటలకు బయలుదేరుతాయి. ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. రూట్‌ నంబర్‌ 10హెచ్‌ కొండాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌ పోలీస్‌ లైన్స్, ఆర్జే కాలేజ్‌ తదితర ప్రాంతాల మీదుగా సరీ్వసులు నడుస్తాయి. కొండాపూర్‌ నుంచి రాత్రి 10.55కు, చివరి బస్సు ఉదయం 3.40 గంటలకు, సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 10.50కు, చివరి బస్సు ఉదయం 3.40 గంటలకు నడుస్తాయి. ప్రతి 50 నిమిషాలకో సరీ్వస్‌ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రార

Original source: sakshi.com
Read more on Kaizer News