Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. వినడానికే ఎంతో విచిత్రంగా ఉన్న ఈ కోణాలన్నీ కలిసిన ఒక దారుణమైన నిజ జీవిత కథ భోపాల్ పోలీసులనే షాక్‌కు గురిచేసింది. ప్రియుడితో భార్య కలిసి ఉండటం సహించలేని ఒక మహిళ, తన మాజీ ప్రియుడిని రంగంలోకి దించి ఓ నిండు ప్రాణాన్ని దారుణంగా బలితీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మోనూ రైక్వార్ అనే వ్యక్తి ఆగస్టు 23న తన భార్య రాఖీ రైక్వార్ కనిపించడం లేదంటూ రాతిబడ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం మొదలైంది. నాలుగు రోజుల పాటు పోలీసులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే ఆగస్టు 27న స్థానిక గోరేగావ్ ప్రాంతంలోని ఒక నిర్మానుష్య పాడుబడిన భవనంలో రాఖీ శవమై తేలింది. ఈ హత్య వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి