Kaizer News

మరో రెండు రాష్ట్రాల్లోని పలుచోట్ల వర్షం..

మరో రెండు రాష్ట్రాల్లోని పలుచోట్ల వర్షం..

· City - Hyderabad · prabhanews.com

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండు నుంచి మూడు గంటల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. రాత్రి వాతావరణంలో మార్పుల కారణంగా ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉందని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు చెప్పారు. రాత్రిపూట ప్రయాణించే వారు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News