కంపాలా: చిన్న పిల్లవాడిగా పట్టాభిషిక్తుడై.. ఆ తరువాత ప్రపంచ నేతల మన్ననలు పొందిన ఉగాండాలోని ‘టూరు’ తెగ రాజు ఓయో నింబా 34 ఏళ్ల చిన్న వయసులో మరణించారు. ఉగాండా ప్రధాని కాల్విన్ రోమిరీ అకీకీ...ఓయో నింబా మరణ వార్తను శుక్రవారం ప్రకటించారు. అయితే ఓయో నింబా అవివా హితుడిగానే మరణించడంతో రాజరికపు వారసత్వంపై ఏర్పడ్డ సస్పెన్స్‌ను కూడా ప్రధాని తీర్చారు. ‘‘రాజరికపు వారసత్వం కొనసాగుతుంది. మహారాజు వారసురాలిగా ఒకరిని నియమించారు. ఆమె ఎవరు? అన్నది తగిన సమయంలో టూరూ రాజ్య సంప్రదాయాలకు అను గుణంగా అధికారికంగా ప్రకటిస్తాం’’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అయితే కేవలం 34 ఏళ్ల వయసులోనే ఓమో నింబా మరణించడాన్ని ఉగాండా ప్రజలు ఇప్పటికీ జీర్ణింయుకోలేక పోతున్నారు. తండ్రి మరణంతో కేవలం మూడేళ్ల వయసులోనో ఓయో నింబా 1995లో ‘టూరు’ రాజుగా పట్టాభిషిక్తు డయ్యాడు. పట్టాభిషేకం సమయంలో రంగురంగుల దుస్తులతో అన్ని విషయాల్లోనూ కుతూహలం చూపించే యువ రాజును చూసి ప్రజలు ఎంతో ముచ్చటపడ్డారు కూడా. గిరిజన సంప్రదాయాలు, తంతులు ముగించుకున్న తరువాత ‘ఓయో నింబా కబంబా ఇగురు రుకిడి–4’గా నామకరణం జరిగింది. ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన రాజుగా ఓయోది ఒక రికార్డు. పద్దెనిమిదేళ్లు వచ్చే వరకూ తన తరఫున రాజరికపు బాధ్యతలు నిర్వహించే ‘రీజెంట్స్’ను నియమించిన ఓయో ఆ తరువాత తాను అన్ని బాధ్యతలు చేపట్టారు. లిబియా నేత గడాఫీ ‘టూరు’ రాజ కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది. 2011లో చనిపోయే ముందు వరకూ గడాఫీ యువ ఓయో, రాజమాతలను తరచూ సందర్శించేవారు. ‘టూరు’ అనేది ఉగాండాలోని అత్యంత పురాతన గిరిజన రాజ్యాల్లో ఒకటి. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం్యం వచ్చిన తరువాత దేశాన్ని ఏకీకృతం చేసేందుకు రాజ్యాలను రద్దు చేశారు. ఆ తరువాత 1993లో వీటి పున రుద్ధరణ జరిగింది. ‘టూరు’ రాజులకు ప్రభు త్వంలో అధికారాలేవీ ఉండవు పార్టీల ద్వారా రాజకీయాలు చేయకుండా చట్టాలు కూడా చేశారు. కాకపోతే గిరిజన సంప్రదాయాల సంరక్షకులుగా వ్యవహరిస్తూంటారు. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు.. చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా