Kaizer News

INDW vs THAW | థాయ్‌లాండ్‌పై షఫాలీ మెరుపులు.. ఆలౌట

INDW vs THAW | థాయ్‌లాండ్‌పై షఫాలీ మెరుపులు.. ఆలౌట్ తప్పించుకున్న భారత్‌..!

· National - India · ntnews.com

INDW vs THAW : మహిళల ఆసియాకప్ తొలి పోరులో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. పసికూన థాయ్‌లాండ్(Thailand) బౌలర్లను ఉతికేసిన ఓపెనర్ షఫాలీ వర్మ(64) అర్ధ శతకంతో చెలరేగగా.. టీ20ల్లో అరంగేట్రం ప్రతీకా రావల్‌(22) మెరిసింది. అయితే.. థాయ్‌ బౌలర్లు మిడిలార్డర్‌ను దెబ్బతీశారు. దాంతో.. టీమిండియా ఆలౌట్ అంచున నిలిచింది. అయితే.. క్రాంతి గౌడ్‌(15 నాటౌట్), శ్రీ చరణి(6 నాటౌట్)లు చివరి దాకా నిలబడి పరువు కాపాడారు. ఫలితంగా ప్రత్యర్థికి 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది హర్మన్‌ప్రీత్ సేన. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియాకప్ తొలి పోరులో భారత జట్టును థాయ్‌లాండ్‌ బౌలర్లు భయపెట్టారు. టాస్ ఓడి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన థాయ్‌ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టారు. ఓపెనర్లు స్మృతి మంధాన(19), షఫాలీ వర్మ(64)లు దూకుడుగా ఆడి శుభారంభమిచ్చారు. అయితే.. సువాన్‌చొనారతి మెరుపు త్రోకు మంధాన వెనుదిరిగింది. 34వ తొలి వికెట్ పడగా అరంగేట్రం ప్లేయర్ ప్రతికా రావల్‌(22) జతగా షఫాలీ చెలరేగింది. ప్రత్యర్థి బౌలర్లకు దడపుట్టిస్తూ 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదింది. ప్రతీక కూడా బ్యాట్ ఝులిపించగా స్కోర్ పరుగులు తీసింది. స్వల్ప వ్యవధిలోనే ఇద్దరిని ఔట్ చేసిన సులీపొర్న్ లవోమి(3-26) థాయ్‌కు బ్రేకిచ్చింది. అనంతరం మిడిలార్డర్‌ బ్యాటర్లు క్రీజులో నిలవకపోవడంతో భారత స్కోర్ వేగం తగ్గింది. ఆఖర్లో క్రాంతి గౌడ్‌(15 నాటౌట్), శ్రీ చరణి(6 నాటౌట్)లు పోరాడడంతో థాయ్‌ ముందు 160 పరగుల లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా

Original source: ntnews.com
Read more on Kaizer News