Kaizer News

Women Entrepreneur | సీఎం సన్నిహితుడు గెస్ట్‌ హౌస్

Women Entrepreneur | సీఎం సన్నిహితుడు గెస్ట్‌ హౌస్‌కు రమ్మన్నాడు.. మహిళా వ్యాపారవేత్త ఆవేదన

· City - Hyderabad · ntnews.com

Women Entrepreneur | రేవంత్‌ సర్కార్‌లో మహిళలకు ఎలాంటి గౌరవం లభిస్తుందో , ఎలాంటి రక్షణ ఉందో తెలిపే ఘటన ఇది.. ఓ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌ ఏకంగా సీఎం సన్నిహితుడి నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించి తన ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం సన్నిహితుల వేధింపుల గురించి ఎక్స్‌ ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. సాయం కోరితే తనను సీఎం సన్నిహితుడు గెస్ట్ హౌస్‌కు రమ్మని పిలిచాడని వాపోయింది. అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం తాను న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, సీఎంకు సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడంటూ కె.శోభా రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎవరి పేర్లు చెప్పలేను కానీ ఇలాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొంది. సదరు వ్యక్తి సీఎం అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తే నాకేంటి..? గెస్ట్ హౌస్‌కు రావు, కనీసం నా BMW కారులో 15 నిమిషాలు నన్ను ఆనందపరుచు అంటూ సీఎం సన్నిహితుడు వేధించాడని ఆమె పేర్కొంది. అవసరమైతే వీధుల్లో ముష్టి ఎత్తుకుని బతుకుతాను కానీ పని కోసం ఇలాంటి తప్పుడు పనులు చేయను అని బదులు ఇచ్చాను అంటూ కె.శోభా రెడ్డి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది

Original source: ntnews.com
Read more on Kaizer News