Kaizer News

ఇస్రోలో 175 సైంటిస్ట్/ఇంజినీర్ ఉద్యోగాలు: బీటెక్ వ

ఇస్రోలో 175 సైంటిస్ట్/ఇంజినీర్ ఉద్యోగాలు: బీటెక్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. మిస్సవకండి !

· National - India · v6velugu.com

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ICRB) ద్వారా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో మొత్తం 175 సైంటిస్ట్/ ఇంజినీర్ 'SC' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇస్రో కేంద్రాలు, భౌతిక పరిశోధనా ప్రయోగశాల (PRL)లో గ్రూప్ 'ఏ' గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్​లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొనసాగుతుంది. విభాగాల వారీగా ఖాళీలు: సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్​సీ (ఎలక్ట్రానిక్స్) 99, సైంటిస్ట్/ ఇంజినీర్ ఎససీ్​ (మెకానికల్) 52, సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్​సీ (ఎలక్ట్రానిక్స్) – (పీఆర్ఎల్) 1, సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్​సీ (మెకానికల్)– (పీఆర్ఎల్) 1, సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్​సీ (కంప్యూటర్ సైన్స్)–- (పీఆర్ఎల్) 1. ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్​ విభాగాల్లో కనీసం 65 శాతం లేదా 6.84/ 1‌‌0 సీజీపీఏతో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి: 2026, సెప్టెంబర్ 19 నాటికి 28 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులు రూ. 750 చెల్లించాలి. పరీక్ష రాసిన అభ్యర్థులకు రూ.500 తిరిగి చెల్లిస్తారు. సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.isro.gov.in ను సందర్శించండి. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని రెండు విభాగాలుగా విభజించారు. పార్ట్–ఏలో సంబంధిత ఇంజినీరింగ్ విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 80 మార్కులకు ఇస్తారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. పార్ట్–బిలో ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. న్యూమరికల్, లాజికల్, డయాగ్రామాటిక్, అబ్‌స్ట్రాక్ట్ అండ్ డిడ్యూటివ్, రీజనింగ్​పై మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 15 ప్రశ్నలు 20 మార్కులకు ఇస్తారు. ఈ విభాగానికి ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. రాత పరీక్షలో అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు పార్ట్–ఏ, పార్ట్–బిలో వేర్వేరుగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ రాత పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అందుబాటులో ఉన్న ఖాళీలకు 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు షార్ట్​లిస్ట్ చేస్తారు. మొత్తం మీద కనీసం 10 మంది అభ్యర్థులు ఉండేలా చూస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. సాంకేతిక (అకడమిక్) పరిజ్ఞానం 40 మార్కులు, ప్రత్యేకత కలిగిన రంగానికి సంబంధించిన సాధారణ అవగాహనకు 20 మార్కులు, ప్రెజెంటేషన్ / కమ్యూనికేషన్ నైపుణ్యాలకు 20 మార్కులు, కాంప్రహెన్షన్ 10 మార్కులు, అకడమిక్ అచీవ్​మెంట్స్ (సంస్థ రకం, అకడమిక్ ప్రతిభ, ర్యాంక్ మొదలైనవి)కు 10 మార్కులు కేటాయించారు

Original source: v6velugu.com
Read more on Kaizer News