Kaizer News

Suicide | ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం.. నీట్

Suicide | ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం.. నీట్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య

· City - Hyderabad · ntnews.com

హైదరాబాద్ : నీట్‌ పీజీకి సన్నద్దమవుతున్న విద్యార్థిని ఆత్మహత్య ( Suicide ) చేసుకుంది. నగరంలోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో అపరాజిత హాస్టల్లో నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న యశ్విత ( Yashwitha ) శనివారం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె యశ్విత ఆరు నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతుంది. పరీక్షల మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News