Kaizer News

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

· City - Hyderabad · sakshi.com

చౌటుప్పల్‌ : హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా ఉన్న ఈ రద్దీ ఆదివారం మరింతగా పెరిగింది. వివాహాది శుభకార్యాలు, గ్రామదేవతల పండుగలు, వీకెండ్‌ కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించారు. దీనికి తోడు పలుచోట్ల రోడ్డు పనులు జరుగుతుండటంతో హైవేపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ నెలకొంది. చౌటుప్పల్‌ మండలంలోని తూప్రాన్‌పేట, ధర్మోజిగూడెం, చౌటుప్పల్‌ తదితర ప్రాంతాల్లో అండర్‌పాస్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా చోట్ల రోడ్డు ఇరుకుగా మారి వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధర్మోజిగూడెం నుంచి విజయవాడ మార్గంలో చౌటుప్పల్‌ వరకు ఉన్న కేవలం 5 కిలోమీటర్ల దూరాన్ని దాటేందుకు వాహనాలకు ఏకంగా అరగంట సమయం పట్టింది. చౌటుప్పల్‌ పట్టణంలోని వలిగొండ రోడ్డు నుంచి మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో ఉన్న ఎస్‌ఎంఆర్‌ ఫంక్షన్‌హాల్‌ వరకు వాహనాలు బారులుదీరాయి. ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్ ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు.. రౌడీషీటర్ కమ్మసాయి దారుణ హత్య.. అసలేం జరిగింది..?

Original source: sakshi.com
Read more on Kaizer News