Kaizer News

Pargi: గోపాల్‌పై కర్రలతో విచక్షణారహిత దాడి.. విషమం

Pargi: గోపాల్‌పై కర్రలతో విచక్షణారహిత దాడి.. విషమంగా పరిస్థితి!

· City - Hyderabad · hmtvlive.com

Shorts PARGI: వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ గ్రామంలో గోపాల్ అనే వ్యక్తిపై కర్రలతో దాడి జరిగినట్లు సమాచారం. గోపాల్, నర్సింలు మధ్య జరిగిన గొడవే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. నర్సింలు తన అన్నతో కలిసి గోపాల్‌పై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు స్థానికుల ద్వారా సమాచారం. ఈ దాడిలో గోపాల్ తలకు తీవ్ర రక్తగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోపాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గోపాల్, నర్సింలు మధ్య అసలు వివాదం ఏమిటి? దాడికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇక గాయపడిన గోపాల్‌ను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా.. అక్కడ డ్యూటీ డాక్టర్ ఆనంద్ వ్యవహరించిన తీరుపై బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న పేషెంట్‌కు చికిత్స అందించాల్సిన సమయంలో డాక్టర్ వాగ్వాదానికి దిగారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులపై కూడా డాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వారు చెబుతున్నారు. పేషెంట్ పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో చికిత్సపై దృష్టి పెట్టకుండా వాగ్వాదానికి దిగడం ఏమిటంటూ గోపాల్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యుల వివరణ, పోలీసుల దర్యాప్తులో వెలువడే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గోపాల్ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News