Kaizer News

సైప్రస్‌లో పడవ బోల్తా

సైప్రస్‌లో పడవ బోల్తా

· National - India · ntnews.com

99 మంది గల్లంతు కైరేనియా: సైప్రస్‌లోని కైరేనియా(గిర్నె) నుంచి తుర్కియేలోని టౌకుకు ప్రయాణిస్తున్న పడవ ఆదివారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పడవలో ఉన్న 258 ప్రయాణికుల్లో 159 మందిని విపత్తు సహాయక బృందాలు రక్షించినట్టు కైరేనియా మేయర్‌ మురత్‌ సెంకుల్‌ తెలిపారు. కైరేనియా నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే నాలుగు మైళ్ల దూరంలో పడవ బోల్తా పడిందని సైప్రస్‌ మెయిల్‌ తెలిపింది. తీర గస్తీ నౌకలు, హెలికాప్టర్లు, పడవలతో గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించినదిగా చెప్తున్న ఓ వీడియోలో అల్లకల్లోలంగా ఉన్న నీటిలో పడవ ఒక పక్కకు ఒరిగినట్టు కనిపించింది

Original source: ntnews.com
Read more on Kaizer News