పటాన్‌చెరు సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ పాలన పేదలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆగ్రహం 22ఏ బాధితులకు భరోసా కల్పించిన బీఆర్‌ఎస్ కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం.. వంటావార్పు చేస్తాం పటాన్‌చెరు నియోజకర్గంలో ప్రజల కష్టార్జితాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కబ్జా చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న 50,565 ఎకరాలను తొలగించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడించి అక్కడే వంటా వార్పు చేస్తామని ఆయన హెచ్చరించారు. పటాన్‌చెరులో 50వేల ఎకరాలకు పైచిలుకు భూములు, లక్ష ఇండ్లను 22ఏ జాబితాలో పెట్టిన సర్కార్.. పేద, మధ్యతరగతి కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేస్తోందని హరీశ్ మండిపడ్డారు. పటాన్‌చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన 22ఏ భూబాధితుల నిరసన సభకు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 22ఏ జాబితాలో భూములు ఉన్న బాధితుల కన్నీళ్లు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థమవుతోందన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. 1980లో లే అవుట్ చేసి 46 ఏళ్లుగా నివసిస్తుంటే ఇప్పడు వాటిని నిషేధిత జాబితాలో పెట్టి పిల్లల పెళ్లిళ్లు, చదువులకు ఆటంకం కలిగిస్తున్నారని, బ్యాంక్‌లోన్‌లు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. పైసా పైసా కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హుడా పర్మిషన్లు, మున్సిపల్ పర్మిషన్లు, కరెంటు, నల్లా కనెక్షన్లు ఇచ్చి ప్రాపర్టీ టాక్స్‌లు వసూలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీ ఆస్తులు 22ఏలో ఉన్నాయని ఇళ్లను కూల్చడం దుర్మార్గమన్నారు. పటాన్‌చెరు పరిధిలోని ఓ ఎమ్మార్వో ఏకంగా 2 కోట్లు లంచం అడిగాడని, హైకోర్టు అక్షింతలు వేసినా పట్టించుకోకుండా ఇల్లు కూలగొట్టి తనను రోడ్డున పడేశారని ఓ బాధితుడు కన్నీరు మున్నీరుగా చెబుతుంటే రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గుమ్మడిదలలో 12,430 ఎకరాలు, అమీన్‌పూర్‌లో 3,266 ఎకరాలు, రామచంద్రాపురంలో 8,360 ఎకరాలు, పటాన్‌చెరులో 12,593 ఎకరాలు, జిన్నారంలో 13,916 ఎకరాల భూములు నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. వాటికి సంబంధించిన భూ వివరాలను బాధితులు.. ఎమ్మెల్యే హరీశ్‌రావుకు చూపించారు. పటాన్‌చెరు అంటేనే మధ్యతరగతి, పేద ప్రజలు, చిరుద్యోగుల ఉండే ప్రాంతం అని అన్నారు. ఏ పాపం తెలియని వీరి మీద కాంగ్రెస్ ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రశ్నించారు. భూములు నిషేధిత జాబితాలో పెడితే వారికి రైతుబంధు, రైతుబీమా రాదన్నారు. ఈ దుర్మార్గం కేవలం పటాన్‌చెరుకు మాత్రమే పరిమితం కాలేదని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కత్బుల్లాపూర్, మలక్‌పేట, ఉప్పల్ ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ప్రాంతానికి వెళ్లినా.. లక్షల ఆస్తులు 22ఏ జాబితాలో పెట్టారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్