Shorts కడ్తాల్: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంటి వైద్యానికి దూరం కాకూడదనే లక్ష్యంతో.. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & TASK C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో* నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య సేవల్లో భాగంగా కడ్తాల్‌లో నిర్వహించిన 6వ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది.. 6 రోజులు పాటు నిర్వహించిన కంటి పరీక్షల సందర్భంగా.. * 154 మందికి విజయవంతంగా ఉచిత కంటి శుక్లాల ఆపరేషన్లు పూర్తి.. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రతి మనిషి జీవితంలో కంటి చూపు ఎంతో ముఖ్యమైనది,ముఖ్యంగా పేద కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా కంటి సమస్యలను నిర్లక్ష్యం చేసే పరిస్థితులు మనం చూస్తుంటాం, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఉచిత కంటి వైద్య శిబిరాల ఆలోచనతో ముందుకు వచ్చాం, వెల్దండలో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం.. ఆమనగల్, కల్వకుర్తి, మాడ్గుల, తలకొండపల్లి మీదుగా ఇప్పుడు కడ్తాల్ వరకు ఆరు మండలాల్లో ఆరు శిబిరాలుగా విస్తరించింది.. ఈ ఆరు శిబిరాల్లో 19,791 మందికి పైగా కంటి పరీక్షలు చేయడం, 15,497 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు అందించడం, 876 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. కడ్తాల్ శిబిరంలో కూడా వేలాది మంది ప్రజలు వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు, అవసరమైన వారికి అద్దాలు అందించాం, కంటి శుక్లాలతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించాం,ఆర్థిక స్థోమత వైద్యానికి అడ్డంకి కాకూడదు, పేదరికం కారణంగా ఎవ్వరూ కంటి చూపును కోల్పోయే పరిస్థితి రాకూడదు,ప్రజలకు అవసరమైన చోట వైద్య సేవలు అందించాలన్నదే మా ప్రయత్నం అని పేర్కొంటూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శంకర నేత్రాలయ వైద్యులు, సిబ్బందికి మరియు కారక్రమానికి సహకరించి,శిబిరానికి విచ్చేసిన కడ్తల్ మండల వివిధ గ్రామాల తాజా,మాజీ ప్రజా ప్రతినిధులకు,నాయకులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.. ఈ రోజు కడ్తాల్ శిబిరం ముగిసింది కానీ.. పేదల కళ్లలో వెలుగులు నింపే సేవకు ముగింపు లేదు.. ప్రజల కోసం సాగించే ప్రయాణానికి విరామం లేదు.. ప్రజల అవసరాలను గుర్తిస్తూ.. ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం.. అని ఈ సందర్భంగా తెలియజేశారు.. * దేవుడు జన్మనిస్తే..సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు మాకు పునర్జన్మనిచ్చారు" .. “కంటి చూపు సరిగ్గా లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం,ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్న సమయంలో సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరం గురించి తెలిసింది,ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకున్నాం,కంటి సమస్యను గుర్తించి ఉచితంగా ఆపరేషన్ కూడా చేశారు,ఇప్పుడు మళ్లీ స్పష్టంగా చూడగలుగుతున్నాం.. డబ్బులు లేని మా లాంటి పేదలకు ఉచితంగా వైద్యం అందించి, మా కళ్లలో వెలుగు నింపిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం,దేవుడు మాకు జన్మనిస్తే.. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు మాకు పునర్జన్మనిచ్చినట్టుగా అనిపి