సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్‌కు ఆడియన్స్ నుంచి ఆదరణ లభించింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు రోల్‌ను రివీల్ చేశారు. ఈ మూవీలో ఆయన దిలీప్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ వీడియో పంచుకున్నారు. ఇందులో కారుపై కూర్చుని సిగరెట్ తాగుతూ మాస్ లుక్‌లో కనిపించారు. ఇది చూస్తంటే సూరజ్ పవర్‌పుల్ రోల్ చేయనున్నారని అర్థమవుతోంది. కాగా.. ఈ భారీ ప్రాజెక్ట్ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు) సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ (ఫొటోలు) 'మగాళ్లు జిందాబాద్' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) రెండేళ్లకే కోహ్లి రికార్డు సమం.. అభిషేక్ శర్మ అరుదైన ఫీట్! సెంచరీ తర్వాత పిచ్ పైనే ధ్యానం.. అసలు కారణం ఇదే సత్యమేవ జయతే.. దానం అనర్హత వేటుపై KTR సంచలన ట్వీట్ లోకల్ ఎన్నికల్లో ఒక్కొక్కడికి.. కొడాలి నాని మాస్ వార్నింగ్