Kaizer News

Nepal Floods: నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గల్లం

Nepal Floods: నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గల్లంతు!

· National - India · hmtvlive.com

Nepal Floods: హిమాలయ భూభాగం నేపాల్‌ను ముంచెత్తుతున్న ప్రాణాంతక వరదలు, కొండచరియల విపత్తులో ఒక విషాదకర పరిణామం చోటుచేసుకుంది. భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అనుబంధ విభాగానికి చెందిన కీలక అధికారి, ‘ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్’ సీఈఓ లక్ష్ గోపిశెట్టి కాఠ్మాండూ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకుని గల్లంతయ్యారు. సొంత పనుల నిమిత్తం నేపాల్‌ వెళ్లిన లక్ష్ గోపిశెట్టి, అక్కడ కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఒక్కసారిగా విరుచుకుపడిన ప్రవాహాల్లో చిక్కుకుపోవడం ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. వరదల ధాటికి నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్, మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఆయనతో సంబంధాలు తెగిపోయాయి. హిమాలయ ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గకపోవడంతో బాధితులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సిగ్నల్ వ్యవస్థల ఆధారంగా అన్వేషణ ముమ్మరం చేశామని, లక్ష్ గోపిశెట్టి జాడను త్వరలోనే కనుగొంటామని సహాయక అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇన్ఫోసిస్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మా సంస్థ ప్రతినిధి, సీఈఓ లక్ష్ గోపిశెట్టి క్షేమంగా తిరిగి రావడమే మా మొదటి ప్రాధాన్యత. ఆయన ఆచూకీ కోసం నేపాల్ స్థానిక యంత్రాంగం, సహాయక ఏజెన్సీలు, దౌత్య అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ కష్టసమయంలో ఆయన కుటుంబానికి ఇన్ఫోసిస్ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని స్పష్టం చేసింది. అమెరికా, కెనడా దేశాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలకు సాంకేతిక సేవలు అందించే ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్‌కు లక్ష్ గోపిశెట్టి సారథ్యం వహిస్తున్నారు. దాదాపు ముప్పై ఏళ్లకు పైగా ఐటీ రంగంలో అపార అనుభవం గడించిన ప్రముఖ అధికారి ఇలా విపత్తులో చిక్కుకోవడం పట్ల గ్లోబల్ టెక్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News