Kaizer News

Gold Prices: బంగారం ధరలపై భారీ ఊరట.. ఈ వారం మరింత

Gold Prices: బంగారం ధరలపై భారీ ఊరట.. ఈ వారం మరింత పతనమయ్యే ఛాన్స్.. కొనేవారికి ఇదే మంచి ఛాన్స్..

· Business · tv9telugu.com

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పతనమవుతున్నాయి. గత వారంలో భారీగా కుప్పకూలాయి. అంతకముందు వారంలో భారీగా పెరగ్గా.. గత వారంలో పడిపోతూ వచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో పసిడి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా డాలర్ బలపడటం, లాభాల స్వీకరణ, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రెట్లపై అంచనాల క్రమంలో గోల్డ్ రేట్లు క్రాష్ అవుతూ వస్తోన్నాయి. అయితే ఈ పతనం ఎంతకాలం కొనసాగుతుందనేది చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ఇటీవల భారీగా పెరగడంతో తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి పెట్టుబడిదారులు లాభాలు పొందారు. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో గోల్డ్ రేట్లు దిగజారుతున్నాయి. ఆగస్ట్ 24వ తేదీన దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,450 వద్ద ప్రారంభమవ్వగా.. ఆగస్ట్ 30 నాటికి రూ.1,56,800కి చేరుకుంది. కేవలం ఆరు రోజుల్లో రూ.6,650 తగ్గింది. మొత్తం 4.07 శాతం మేర క్షీణించింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఆగస్ట్ 30న 22 క్యారెట్ల రేటు రూ.1,43,730 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఆగస్ట్ 24వ తేదీన కిలో వెండి ధర రూ.2,45,200గా ఉండగా.. ఆగస్ట్ 30 నాటికి రూ.2,42,120కి పడిపోయింది. ఆరు రోజుల్లోనే రూ.3080 తగ్గిందని చెప్పవచ్చు. డాలర్ బలపడటం, మార్కెట్లో హెచ్చుతగ్గుల వల్ల వెండి కూడా ప్రభావితం అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వారంలో బంగారం మరింత తగ్గే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ మళ్లీ పుంజుకోవడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని అడ్డుకునేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ చీఫ్ ప్రకటన చేశారు. యూఎస్ వడ్డీ రేట్ల పెరగవచ్చనే ప్రచారం సాగుతోంది. దీంతో డాలర్, యూఎస్ బాండ్లు మరింత పుంజుకోవడంతో పెట్టుబడిదారుల్లో బంగారాన్ని ఆకర్షణ తగ్గింది. దీంతో రానున్న కొద్ది రోజుల పాటు ధరలు మరింత తగ్గవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను నమ్మడానికి వీల్లేదు. పెట్టుబడి పెట్టేవారు లేదా కొనుగోలు చేసేవారి ఒకసారి విశ్లేషించుకోవాలి. అనంతరం పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. ఆగస్ట్ 30న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,240 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,050 వద్ద ట్రేడవుతోంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.60 లక్షలుగా ఉంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News