Kaizer News

Collector Chahat Bajpai | క్రీడాకారులకు అంతర్జాతీయ

Collector Chahat Bajpai | క్రీడాకారులకు అంతర్జాతీయస్థాయి మౌలిక వసతుల కల్పనకు చర్యలు : కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి

· National - India · ntnews.com

హనుమకొండ చౌరస్తా : క్రీడాకారులకు అంతర్జాతీయస్థాయి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి ( Collector Chahat Bajpai ) అన్నారు. శనివారం హనుమకొండలో స్విమ్మింగ్‌ పూల్‌( Swimmingpool ) ను , జేఎన్‌ఎస్ ఇండోర్‌ స్టేడియంలో పునర్నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న బ్యాడ్మింటన్‌ స్టేడియం ( Badminton Stadium ) ను వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, జేఎన్‌ఎస్ ఇండోర్‌ స్టేడియం, స్విమ్మింగ్‌ పూల్‌లలో క్రీడా వసతులను మెరుగైన ప్రమాణాలతో అభివృద్ధి చేశామని తెలిపారు. క్రీడాకారులు ఈ సదుపాయాలను తమ సొంత ఆస్తిగా భావించి సద్వినియోగం చేసుకోవడంతో పాటు వాటి పరిరక్షణకు కూడా సహకరించాలని సూచించారు. స్పోర్ట్స్​‍ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. స్పోర్ట్స్​‍ స్కూల్‌కు ప్రత్యేక భవనం నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేశామని, ఈ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ స్పోర్ట్స్​‍ స్కూల్‌ కు సొంత భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుం టున్నామని, త్వరలోనే ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్‌, ఏసీపీ జితేందర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్ధిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి , జూడో అసోసియేషన్‌ రాష్ర్ట కార్యదర్శి కైలాస్ యాదవ్‌, ఆఫీసర్స్​‍ క్లబ్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ హనుమకొండ ప్రధాన కార్యదర్శి రమేష్‌రెడ్డి, జర్నలిస్టు యూనియన్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, డీఎస్ఏ కోచ్‌లు, స్టాఫ్‌ పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News