Kaizer News

ది ఇంటర్న్‌ రీమేక్‌ కోసం..

ది ఇంటర్న్‌ రీమేక్‌ కోసం..

· Entertainment · ntnews.com

అమెరికన్‌ కామెడీ డ్రామా ‘ది ఇంటర్న్‌’ హిందీ రీమేక్‌ కోసం గత ఐదేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమితాబ్‌బచ్చన్‌, దీపికా పడుకోన్‌ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటన కూడా వెలువడింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మరలా సెట్స్‌మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అమిత్‌శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ‘పీకూ’ తర్వాత అమితాబ్‌బచ్చన్‌-దీపికా పడుకోన్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుందని సమాచారం. హాలీవుడ్‌ చిత్రాన్ని యథాతథంగా కాకుండా భారతీయ నేపథ్యానికి తగినట్లుగా మార్పులు చేయబోతున్నట్లు దర్శకుడు తెలిపారు. స్వీయ నిర్మాణంలో దీపికా పడుకోన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నదని తెలిసింది. ఓ యువ వ్యాపారవేత్త ఫ్యాషన్‌ సంస్థను నడిపించే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, అదే సంస్థలోకి 70 ఏళ్ల రిటైర్డ్‌ వ్యక్తి సీనియర్‌ ఇంటర్న్‌గా చేరడంతో వారిద్దరి మధ్య వృత్తిపరమైన స్నేహం, మానవ సంబంధాలు ప్రధానంగా ‘ది ఇంటర్న్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు

Original source: ntnews.com
Read more on Kaizer News