Kaizer News

18-poles-pending-bompalli : బోంపెల్లిలో భ‌యం భ‌యం

18-poles-pending-bompalli : బోంపెల్లిలో భ‌యం భ‌యం Andhra Prabha Exclusive Story

· City - Hyderabad · prabhanews.com

బోంపెల్లిలో భ‌యం భ‌యం Andhra Prabha Exclusive Story ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్థంభాలు శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బొంపల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన విద్యుత్‌ స్థంభాలను మార్చాలని ఆరు నెలల క్రితమే విద్యుత్‌ శాఖ అధికారులకు నివేదించినా ఇప్పటివరకు కొత్త స్థంభాలు ఏర్పాటు చేయకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా సుమారు ఆరు నెలల క్రితం విద్యుత్‌ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్‌ దాడి మౌనిక సంతోష్‌, ఉప సర్పంచ్‌ పంబాల రాజు, వార్డు సభ్యులు కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న విద్యుత్‌ స్థంభాలు, లూజ్‌ హోల్స్‌ను గుర్తించారు. మొత్తం 18 విద్యుత్‌ స్థంభాలను మార్చాల్సిన అవసరం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థంభాల ఏర్పాటుకు విద్యుత్‌ శాఖ నుంచి మంజూరు కూడా జరిగినప్పటికీ.. నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. సర్పంచ్‌, పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజలు పలుమార్లు విద్యుత్‌ శాఖ ఏఈని కలిసి సమస్యను పరిష్కరించాలని కోరినప్పటికీ.. ఏర్పాటు చేస్తాం అనే సమాధానమే వస్తోందని, క్షేత్రస్థాయిలో మాత్రం పనులు జరగడం లేదని వారు వాపోతున్నారు. శిథిలమైన స్థంభాలతో పాటు విద్యుత్‌ లైన్లు కూడా లూజ్‌గా ఉండటంతో వర్షాలు కురిసిన సమయంలో తరచూ షార్ట్‌ సర్క్యూట్‌లు ఏర్పడుతున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటమే కాకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ తెలిపారు. విద్యుత్‌ స్థంభాలు మరింత దెబ్బతింటే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితమే సమస్యను గుర్తించి, 18 స్థంభాలు మార్చాల్సిందిగా నివేదించినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచి చూస్తున్నారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న స్థంభాలు వెంటనే తొలగించి కొత్త స్థంభాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామంలో నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా కోసం మా పాలకవర్గంతో చర్చించాం. గ్రామంలో ప్రమాదకరంగా, శిధిలావస్థలో ఉన్న స్థంభాలు, లూజ్ వైర్లు గుర్తించి మరమ్మతులు సంభందిత అధికారులకు నివేదించా. అనేక సార్లు విద్యుత్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. స్థానికంగా పని చేసే విద్యుత్ ఉద్యోగులకు నిత్యం చెబుతూనే ఉన్నా. లూజ్ వైర్లు సరిచేయడం, 18 స్థంభాలు పాతవి తొలగించి కొత్తవి వేయడానికి మంజూరు లభించింది. కానీ ఆధికారుల నిర్లక్ష్యంతో స్థంభాలు వేయడం లేదు. లూజ్ లైన్లు సరి చేయడంలేదు. తక్షణమే విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. లేకుంటే గ్రామస్థులతో కలిసి ఎస్ఈ, ఏఈ కార్యాలయాలు ముట్టడిస్తాం

Original source: prabhanews.com
Read more on Kaizer News