Kaizer News

హైదరాబాద్‌లో ప్రాణం తీసుకున్న ఏఆర్ కానిస్టేబుల్..

హైదరాబాద్‌లో ప్రాణం తీసుకున్న ఏఆర్ కానిస్టేబుల్.. లవ్ ఫెయిలే కారణమా ?

· City - Hyderabad · v6velugu.com

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. లవ్ ఫెయిల్యూరే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంబర్‌పేట్ తిరుమలనగర్‌లో ఉంటున్న నిభాష్ (25) అనే ఏఆర్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు స్నేహితులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించి చనిపోయినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News