Vikarabad: వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజీవ్ గృహకల్ప లోని బ్లాక్ నెంబర్ 49 హౌస్ నెంబర్ 14 లో నివాసముంటున్న 18 సంవత్సరాల వయస్సు గల యువతి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు శంకర్- రేఖ దంపతుల చిన్న కూతురు ప్రీతి 18 సంవత్సరాల వయసుగా పోలీసులు గుర్తించారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి శంకర్ టైలర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్టు సమాచారం. ప్రీతి ఇంటర్ వరకు చదువుకుని ప్రస్తుతం విద్యను కొనసాగించడం లేదని తెలిసింది. ప్రీతి ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది