మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో వచ్చిన రీసెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇరుముడి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ రవితేజ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. వరల్డ్ వైడ్ రూ.250 కోట్ల కలెక్షన్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ ఏరియాల్లో రికార్డులు అధిగమించింది. సాధారణంగా థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకున్న మూవీస్ ఓటీటీల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటాయి. అయితే, ఇరుముడి విషయంలో మాత్రం రివర్స్‌లో జరుగుతోంది. ఈ మూవీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో ఉండగానే... సెప్టెంబర్ 18 (శుక్రవారం) నుంచి ఇంటర్నేషన్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో (Netflix)లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ఓటీటీలో ఇరుముడి స్ట్రీమింగ్ అవుతున్న తర్వాత మిక్స్‌డ్ రెస్పాన్ అందుకుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. డైరెక్టర్ శివ నిర్వాణ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారంటూ కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఊరిలో అన్ని మిస్సింగ్ కేసులు, మర్డర్స్ జరుగుతున్నా పోలీసుల ఎంట్రీ ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ మూవీకి ఓవర్‌రేటెడ్ అనే ముద్ర వేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్స్ పరంగా స్టోరీ పరంగా బాగున్నప్పటికీ అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయంటూ పోస్టులు పెడుతున్నారు. ఇరుముడి ఓటీటీ విషయంలో ఆన్ లైన్‌లో కొందరు ట్రోల్ చేస్తున్నా ఈ మూవీ మాత్రం టాప్ ప్లేస్‌లోనే నిలిచింది. స్ట్రీమింగ్ అవుతున్న రెండు రోజుల్లోనే అన్నీ సినిమాలను వెనక్కి నెట్టి నెం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గ్రామాల్లో ఇరుముడి సందడి నెలకొంది. స్క్రీన్స్ కట్టి మరీ ఇరుముడి మూవీని విలేజ్ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా, అయ్యప్ప పాటలకు డ్యాన్సులు వేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే? రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు. రవితేజ కూతురి పాత్రలో బేబీ నక్షత్ర నటించారు. అలాగే, అజయ్ ఘోష్, స్వాసిక, సాయి కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సీలేరు సమీపంలోని పొల్లూరు గ్రామంలో సాధారణ అరటి రైతు త్రినాథ్ (రవితేజ) కూతురు మణెమ్మ (బేబీ నక్షత్ర) అంటే ప్రాణం. మద్యం లేకపోతే ఉండలేడు కానీ... కూతురి కోసం ఏటా అయ్యప్ప మాలధారణ తీసుకుని పవిత్రంగా 41 రోజులు దీక్ష చేస్తాడు. ఎవ్వరికీ భయపడని త్రినాథ్ కూతురిని కూడా అలానే పెంచుతాడు. అందుకే ఆమె స్కూల్‌కు వెళ్లినప్పుడు ఊరిలో ఏం జరిగినా తండ్రికి చెబుతుంది. ఇదే టైంలో ఊరిలో వరుసగా అమ్మాయిలు శవాలుగా కనిపిస్తుంటారు. స్కూల్లో జరిగిన ఓ సంఘటన గురించి తండ్రికి చెప్పాలనుకుంటుంది మణెమ్మ. ఇంతలోనే ఊహించని పరిణామాలు జరుగుతాయి. అసలు మణెమ్మ చెప్పాలనుకున్న విషయానికి ఊరిలో అమ్మాయిల హత్యలకు సంబంధం ఏంటి? ఈ విషయం తెలుసుకున్న త్రినాథ్ ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిర