Kaizer News

Hisense A10 Pro : ఈ ఫోన్ స్క్రీన్ వెనక్కి తీసేయొచ్

Hisense A10 Pro : ఈ ఫోన్ స్క్రీన్ వెనక్కి తీసేయొచ్చు.. హైసెన్స్ A10 సిరీస్ లాంచ్

· Technology · hmtvlive.com

Hisense A10 Pro : స్మార్ట్‌ఫోన్ రంగాన్ని సరికొత్త బాట పట్టించేలా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హైసెన్స్ (Hisense) ఒక అద్భుతమైన కాన్సెప్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. చైనా మార్కెట్‌లో ‘Hisense A10 Pro’ , ‘Hisense A10 Ultra’ పేర్లతో రెండు ప్రత్యేకమైన ఈ-ఇంక్ (E-Ink) స్మార్ట్‌ఫోన్లను సంస్థ అధికారికంగా విడుదల చేసింది. సాధారణ డిజిటల్ స్క్రీన్ల వల్ల కళ్లకు కలిగే శ్రమను తగ్గించేలా పేపర్‌లాంటి రీడింగ్ అనుభూతిని అందించడంతో పాటు, అవసరమైనప్పుడు రంగుల ప్రపంచాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేకమైన డిటాచబుల్ కలర్ స్క్రీన్‌ను అమర్చుకునే వినూత్న సాంకేతికతను ఈ సిరీస్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. హైసెన్స్ A10 సిరీస్‌లో 6.13 అంగుళాల Carta 1300 e-ink డిస్‌ప్లేను అమర్చారు. ఇది 1648×824 పిక్సెల్స్ రిజల్యూషన్ , 300 ppi పిక్సెల్ డెన్సిటీతో స్పష్టమైన విజువల్స్ ఇస్తుంది. 256 గ్రేస్కేల్ లెవల్స్, 36 డ్యూయల్-కలర్ ఫ్రంట్ లైటింగ్ సపోర్ట్‌తో వచ్చే ఈ స్క్రీన్ సాధారణ స్మార్ట్‌ఫోన్లలా కాకుండా సరిగ్గా పుస్తకం చదువుతున్న అనుభూతినే అందిస్తుంది. ఇందులో బ్లూ లైట్, స్క్రీన్ ఫ్లికర్ వంటి సమస్యలు ఏమాత్రం ఉండవు. దాంతో నిరంతరం ఈ-బుక్స్ చదివేవారు, పిడిఎఫ్ ఫైళ్లు పరిశీలించే విద్యార్థులు, డిజిటల్ నోట్స్ రాసుకునే వారికి ఇది ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇందులో ప్రత్యేకంగా E Ink T2000 హార్డ్‌వేర్ TCON చిప్‌ను సైతం వాడారు. అవసరమైనప్పుడు జోడించుకునే డిటాచబుల్ కలర్ స్క్రీన్ ఈ A10 సిరీస్‌లోనే అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని డిటాచబుల్ కలర్ స్క్రీన్ కాన్సెప్ట్. ఫోన్ వెనుక భాగంలో ఉండే మాగ్నెటిక్ రింగ్, మెటల్ కాంటాక్ట్స్ ఆధారంగా 4.96 అంగుళాల ఎల్‌సీడీ కలర్ డిస్‌ప్లేను సులభంగా అమర్చుకోవచ్చు లేదా తొలగించుకోవచ్చు. ఈ కలర్ స్క్రీన్‌ను అమర్చిన వెంటనే ఇది ఒక సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా మారిపోతుంది. దీని సహాయంతో కలర్ కామిక్స్ చదవడం, వర్ణరంజిత ఫొటోలు, వీడియోలు చూడటం , సోషల్ మీడియా యాప్స్‌ను హాయిగా వినియోగించుకోవచ్చు. అత్యుత్తమ మోడల్ అయిన A10 Ultra బాక్స్‌లోనే ఈ కలర్ స్క్రీన్ లభిస్తుండగా, A10 Pro మోడల్‌లో మాగ్నెటిక్ సపోర్ట్ ఉన్నప్పటికీ కలర్ స్క్రీన్‌ను వినియోగదారులు విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఫోన్లలోనూ 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేసే 4nm ఆధారిత Qualcomm QCM6690 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ-ఇంక్ డిస్‌ప్లే స్వభావాన్ని బట్టి బ్యాటరీ వినియోగాన్ని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకునేలా దీని పవర్ మేనేజ్‌మెంట్‌ను డిజైన్ చేశారు. చదివే సమయంలో పవర్ వినియోగాన్ని తగ్గించి, ఎక్కువ పనిభారం ఉన్నప్పుడు మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ ఫోన్లలో 4000mAh బ్యాటరీ ఉంది. ఇది 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ , 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేకంగా A10 Ultra వెర్షన్‌లో మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు. ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ఫోన్ వెనుక భాగంలో 48MP ప్రధాన కెమెరాను, సెల్ఫీలు , వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు. సాధా

Original source: hmtvlive.com
Read more on Kaizer News