Kaizer News

Mysaa teaser | గోండు జాతి పిల్లగా రష్మిక రా అండ్ ర

Mysaa teaser | గోండు జాతి పిల్లగా రష్మిక రా అండ్ రస్టిక్ లుక్.. ‘మైసా’ టీజర్ అవుట్..

· Entertainment · prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ టీజర్ విడుదలైంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు రష్మిక వన్ ఉమెన్ షోలా సాగిన ఈ టీజర్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో గోండు జాతికి చెందిన పవర్‌ఫుల్ యువతిగా కనిపిస్తున్నారు. ముఖంపై రక్తపు మరకలు, చేతుల్లో ఆయుధాలతో రష్మిక చూపించిన రౌద్రం, రఫ్ అండ్ టఫ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు గ్లామరస్, బ్యూటిఫుల్ రోల్స్‌లో అలరించిన రష్మిక, ఈ చిత్రంలో తన నటనలోని పూర్తి వైవిధ్యాన్ని, నట విశ్వరూపాన్ని చూపించారు. టీజర్‌ లో గామనిస్తే సావు నుండైనా నీకోసం వస్తాను నాన్నా.. డైలాగ్‌ ద్వారా ఓ తండ్రి కోసం కూతురు చేసే పోరాటమని అర్థం అవుతుంది. సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ తో పాటు తండ్రీకూతుళ్ల ఎమోషనల్‌ పెద్దపీట వేసినట్లు తెలస్తొంది. కాగా రవీంద్ర పుల్లె (పుల్లెల రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో సముద్రఖని, ఈశ్వరీ రావు, రాహుల్ రవీంద్రన్, తారక్ పొన్నప్ప, రావు రమేష్, ప్రవీణ్ దాచారమ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News