Kaizer News

నాలుగేళ్లకు ఓటీటీలో మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్‌..

నాలుగేళ్లకు ఓటీటీలో మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

· Entertainment · sakshi.com

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్, కోర్ట్‌రూమ్ డ్రామా ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. దాదాపు నాలుగేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు కారణాలతో థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఎలాంటి థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. గాంధీ జయంతి సందర్భంగా జీ5 వేదికగా అక్టోబర్ 2 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. గాంధీ జయంతి సందర్భంగా హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతరం తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ తాజాగా వెల్లడించారు. ‘కొన్ని కథలు మీరు చూసే విషయాలనే అనుమానించేలా చేస్తాయి. మరికొన్ని మీరు నమ్మే విషయాలను ప్రశ్నించేలా చేస్తాయి. కానీ ఈ కథ మాత్రం వాటి మధ్యలో ఉన్న ప్రతిదానినీ ప్రశ్నించేలా చేస్తుంది’ అంటూ మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. విభిన్నమైన కథాంశంతో.. నవజ్యోత్ గులాటీ, విషాషా అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్‌తో పాటు హుమా ఖురేషీ, విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్, చైతన్య వ్యాస్, రాజేష్ జైస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దినేష్ విజన్‌కు చెందిన మడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మృణాల్ ఠాకూర్ కెరీర్‌లో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రంగా ‘పూజా మేరీ జాన్’ నిలవనుంది. థియేటర్లలో విడుదల కాకపోవడంతో ఇన్నాళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌తో క్లారిటీ వచ్చింది. కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు గన్నవరం CI లంచావతారం.. నడి రోడ్డుపై నిలదీసిన MLA మళ్లీ ఖాకీ చొక్కాలో సూర్య.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే.! ఫటా ఫటా ఫ్లెక్సీలు మార్చినట్టు కండువా మార్చేశాడు.. జగన్ వస్తే నీ పరిస్థితి ఏంటో నీ ఊహకే వదిలేస్తున్నా!

Original source: sakshi.com
Read more on Kaizer News