Kaizer News

‘క్యూర్‌‌’లో ఇందిరమ్మ ఇండ్లకు లక్కీడ్రా షురూ..నాలు

‘క్యూర్‌‌’లో ఇందిరమ్మ ఇండ్లకు లక్కీడ్రా షురూ..నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో లబ్ధిదారుల ఎంపిక

· City - Hyderabad · v6velugu.com

హైదరాబాద్, వెలుగు: ‘క్యూర్‌‌’ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు లక్కీడ్రా ప్రారంభమైంది. నాంపల్లి, కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కోసం శుక్రవారం లక్కీడ్రా నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపునకు వెట్‌ గార్డెన్స్‌లో, రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమాల్లో హౌసింగ్​శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పాల్గొని డ్రా తీసిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో పేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్స్ నిలుస్తాయని అన్నారు. అర్హతే ప్రామాణికంగా.. కులమతాలు, రాజకీయాలు, పొలిటికల్‌ పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు అత్యంత పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. మీడియా, అర్హులైన లబ్ధిదారుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహిస్తూ, మొత్తం ప్రక్రియను మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7,340 ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున లక్కీడ్రా ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ‘ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తున్నాం. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారు. ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే మిగిలిన 120 మందిలోని అర్హులకు అవకాశం కల్పిస్తాం. ఈ విధానం ద్వారా అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూస్తాం. సీఎం రేవంత్‌ రెడ్డి ఈ నెల 13న కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారు. క్యూర్‌ పరిధిలో తొలి విడతగా లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చేనెల 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తం. మా ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇండ్లను మంజూరు చేసి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నం. మరో 10 రోజుల్లో రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేస్తాం. ఎకరం రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్లు విలువ చేసే ప్రాంతాల్లోనూ పేద కుటుంబాలు గౌరవంగా జీవించాలి అనేది మా ప్రభుత్వ లక్ష్యం” అని పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు పొందిన లబ్ధిదారులకు పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని మంత్రి పొంగుల

Original source: v6velugu.com
Read more on Kaizer News