T20 Cricket: టీ20 క్రికెట్ అనగానే మనకు గుర్తొచ్చేవి ధనాధన్ సిక్సర్లు, మెరుపు అర్ధశతకాలు, ఫోర్ల వర్షం. కానీ, ఈ ఫాస్ట్ ఫార్మాట్‌లో బ్యాటర్ల వీరబాదుడు మాత్రమే కాదు.. ఒక్కోసారి ఊహించని స్థాయిలో టీమ్‌కు కుప్పకూలుతుంటాయి. భారీ షాట్లతో విరుచుకుపడదామని మైదానంలోకి అడుగుపెట్టిన జట్లు, పరుగుల వేట పక్కనబెట్టి క్రీజులో నిలదొక్కుకోవడానికే అష్టకష్టాలు పడిన సందర్భాలూ ఉన్నాయి. టీ20 ఫార్మాట్ చరిత్రలో బ్యాటర్ల ఘోర వైఫల్యంతో అత్యల్ప స్కోర్లకే ఆలౌటై దారుణమైన రికార్డులను మూటగట్టుకున్న జట్ల వివరాలు క్రికెట్ అభిమానులను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. ఈ అవాంఛనీయ జాబితాలో అందరికంటే అగ్రస్థానంలో నిలిచి అత్యంత దారుణమైన రికార్డును తన పేరిట లిఖించుకుంది ఐవరీ కోస్ట్. 2024 నవంబర్ 24న నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యచేధనకు దిగిన ఐవరీ కోస్ట్ బ్యాటర్లు కనీసం దశాంశం దాటలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్ల దాటికి కేవలం 7.3 ఓవర్లలోనే చేతులెత్తేశారు. కేవలం 7 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 0.93 సగటు రన్ రేట్‌తో నమోదైన ఈ స్కోరు, అంతర్జాతీయ టీ20 చరిత్రలోనే అత్యల్ప టీమ్ స్కోరుగా మిగిలిపోయింది