Kaizer News

సిటీలో చిరుజ‌ల్లులు

సిటీలో చిరుజ‌ల్లులు

· City - Hyderabad · prabhanews.com

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో పలుచోట్ల మేఘావృత వాతావరణం కొనసాగుతోంది. రాబోయే కొద్ది గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సమాచారం వెల్లడించింది. హైదరాబాద్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా జల్లులు కొనసాగనున్నాయి. ఉదయం నుంచి రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మధ్యాహ్నం తర్వాత సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా అడపాదడపా జల్లులు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో రాజేంద్రనగర్, శంషాబాద్, బర్కాస్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, కాటేదాన్, కిషన్‌బాగ్‌తో పాటు శామీర్‌పేట్, తుర్కపల్లి, కండ్లకోయ, మేడ్చల్, తుమ్ముకుంట, కీసర, దమ్మాయిగూడ, కాప్రా, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ అడపాదడపా జల్లులు లేదా చిరుజల్లులు పడొచ్చని అంచనా. ప్రజలు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News