Kaizer News

Malkajgiri: మల్కాజిగిరిలో ఘనంగా ఆర్‌పీఎఫ్ 41వ ఆవిర

Malkajgiri: మల్కాజిగిరిలో ఘనంగా ఆర్‌పీఎఫ్ 41వ ఆవిర్భావ దినోత్సవం

· City - Hyderabad · hmtvlive.com

Shorts మల్కాజిగిరి: ఆర్‌పీఎఫ్ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్కాజిగిరి ఆర్‌పీఎఫ్ పోస్టు ఆధ్వర్యంలో ఆదివారం పలు సామాజిక సేవా, ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో సిబ్బంది శ్రమదానం చేపట్టడంతో పాటు రైల్వే స్టేషన్ పరిసరాల్లో మొక్కలు నాటారు. ప్రయాణికులకు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికుల భద్రతపై అవగాహన కల్పించారు. సామాజిక బాధ్యతలో భాగంగా మిర్జాలగూడలోని ఫ్యూచర్ ఫౌండేషన్ హోమ్, మల్కాజిగిరి తుక్కారం గేట్‌లోని సన్నిహిత గర్ల్స్ హోమ్‌లను ఆర్‌పీఎఫ్ సిబ్బంది సందర్శించారు. అక్కడి చిన్నారులతో ఆప్యాయంగా మమేకమై పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ప్రజల భద్రతతో పాటు సామాజిక సేవ, మానవతా దృక్పథం, సమాజ సంక్షేమం పట్ల ఆర్‌పీఎఫ్‌కు ఉన్న నిబద్ధతను ఈ కార్యక్రమాలు చాటిచెప్పాయి. కార్యక్రమాల్లో ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News