Kaizer News

డెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్లకు పోవద్దు..

డెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్లకు పోవద్దు..

· Business · ntnews.com

పెట్టిన ప్రతి పెట్టుబడిపైనా మదుపర్లు రాబడుల్ని ఆశించడం సహజం. అయితే అన్నిచోట్లా ఈ లెక్క కుదరదు. అలా ఆదాయం పంచలేని వాటినే డెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అంటారు. ద్రవ్యోల్బణం, దేశ-విదేశీ ప్రతికూల పరిస్థితులు, పన్నులు, ఇతరత్రా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు.. ఏవైనా కావచ్చు పెట్టుబడులను ఎక్కడికక్కడే ఉంచేస్తాయి. ఇక మదుపర్లకు నయా పైసా రాకపోగా.. ఉన్న విలువే హరించుకుపోతూ ఉంటుంది. వృద్ధి, ఆదాయం, రిటర్నులు అంతకంతకూ నశిస్తాయి. అందుకే పెట్టుబడులను పెట్టే ముందు వాటిని ఏయే అంశాలు ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవడం మదుపరికి ఉండాల్సిన అసలు లక్షణం అని ఎక్స్‌పర్ట్స్‌ సూచిస్తున్నారు. అలాగే పెట్టుబడులలో వైవిధ్యాన్ని కనబర్చాలని సలహా ఇస్తున్నారు. ఒకేచోట ఉంచకుండా పరిస్థితులకు తగ్గట్టుగా మార్చితే లాభిస్తుందని చెప్తున్నారు. నిపుణుల సలహాతో ముందుకెళ్తే ఆకర్షణీయ ప్రయోజనాలకు ఆస్కారం ఉంటుంది

Original source: ntnews.com
Read more on Kaizer News