కాంగ్రెస్ బృందం జన్వాడ ఫామ్‌హౌస్‌ను పరిశీలించి అనుమతులు లేదంది. నాలాపై అక్రమంగా నిర్మించారని, కేటీఆర్ కుటుంబ భూమిగా పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు. Congress MP Chamala Kiran Kumar Reddy | శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ ఫాంహౌస్‌పై కాంగ్రెస్ ఎంపీలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాంహౌస్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా నాలాపైనే ఈ ఫాం హౌస్ నిర్మించారని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఆరోపించారు. శనివారం నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం బస్సు యాత్ర చేపట్టి జన్వాడ ఫాంహౌస్‌కు చేరుకుని అక్కడి భూములను, నిర్మాణాలను పరిశీలించేందుకు ప్రయత్నించింది. బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తమ బృందం ఫాంహౌస్ దగ్గరకు వస్తే కేసులు పెడతామని యజమానిగా చెప్పుకుంటున్న ప్రదీప్‌రెడ్డి అనడం సరికాదన్నారు. ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో అసలు ఫాంహౌస్ ఎలా నిర్మించారో స్పష్టం చేయాలని, కేటీఆర్ స్నేహితుడైన ప్రదీప్‌రెడ్డికి అసలు ఈ ఫాంహౌస్ భూమి ఎలా వచ్చిందో విచారణ జరగాలన్నారు. గతంలో జన్వాడ ఫాంహౌస్ దృశ్యాల కోసం డ్రోన్ ఎగరవేస్తే రేవంత్‌రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు.కేటీఆర్ కేవలం అద్దెకు మాత్రమే ఉంటున్నారని ప్రదీప్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. కేటీఆర్ ఈ ఫామ్‌హౌస్‌ను లీజుకు తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ, తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆ లీజ్ ఒప్పందంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సత్యం రామలింగరాజుకు చెందిన భూముల్లోనే ఈ ఫాంహౌస్‌ను అక్రమంగా నిర్మించారని ఆరోపించారు. కేటీఆర్ సతీమణి శైలిమ పేరుతో పాటు ఆయన అత్తగారి పేరు మీద ఇక్కడ భూములు ఉన్నాయని ఆరోపించారు. ఈ భూములన్నీ శతబిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఉన్నాయని, అసలు సూత్రధారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫామ్‌హౌస్ నిర్మాణం, నాలా ఆక్రమణలకు సంబంధించిన వివరాలపై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో ఫోన్‌లో చర్చించారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు ఉన్నట్లు తేలినా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను, నిజాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలనే జన్వాడ ఫాంహౌస్ పరిశీలనకు వచ్చామన్నారు. ఈ ఫాంహౌస్‌ను నాలా ఆక్రమించి నిర్మించారని, అసలు ఇది ఎవరి పేరు మీద ఉందో స్పష్టత లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌లోని ప్రజాభవన్ నుంచి జన్వాడకు వెళ్లారు. అక్కడ ఉన్న భూముల రికార్డులు, యాజమాన్య వివరాలు, భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను క్షేత్రస్థాయిలో పరిశీలించడమే తమ పర్యటన ఉద్దేశమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఈ పర్యటన నేపథ్యం